జమ్మికుంట: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక విస్డం జూనియర్ కళాశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా అధ్యాపకులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా రావుల శరణ్య ప్రిన్సిపాల్‌గా, బొడ్డుపల్లి సందీప్ కుమార్ కరస్పాండెంట్ గా, కొత్తూరు సోనీ వైస్ ప్రిన్సిపాల్ గా, కుర్ర సిద్దు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే కళాశాల లక్ష్యమని ప్రిన్సిపాల్ కే విజయేందర్ రెడ్డి తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు […]
జమ్మికుంట: మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ, ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు సాయం చేశారన్నారు. ప్రపంచ దేశాలు సైతం ఆమెకు ‘ఉక్కు మహిళ’ అనే బిరుదును ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమె పేరుతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి […]
ఇల్లందకుంట: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా, హుజురాబాద్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఇందిరా గాంధీ స్వాతంత్ర్య పోరాటం నుండి ప్రధాని వరకు దేశానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప నాయకురాలు అని నాయకులు కొనియాడారు. రాజభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, బంగ్లాదేశ్ విమోచన వంటి సంస్కరణలతో ఆమె ప్రజాదరణ పొందారు. ఆమె జీవితం నేటి […]