జమ్మికుంట, అక్టోబర్ 27, 2025: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు అంబాల ప్రభాకర్ (ప్రభు) ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ (Honorary Doctorate) అందుకున్నారు. శనివారం తమిళనాడులోని హోసూర్ నగరంలో జరిగిన కార్యక్రమంలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి తమిళనాడు, కర్ణాటక యూనివర్సిటీ ప్రముఖుల చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.ఈ సందర్భంగా డా. అంబాల ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ డాక్టరేట్ తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. […]