జమ్మికుంట మండల కేంద్రంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కోశాధికారి లద్దునురి విష్ణు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేశ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.జమ్మికుంట బాలికల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, గురుకుల పాఠశాలలకు, శిథిలావస్థలో […]