జమ్మికుంట: బీసీ హక్కులు బీసీలకే దక్కాలి, బీసీ రిజర్వేషన్లు ప్రజాస్వామిక హక్కే” అనే నినాదంతో మానవ హక్కుల వేదిక (HRF) ఆధ్వర్యంలో రేపు (నవంబర్ 20, బుధవారం) ఇందిరానగర్ లోని దినేష్ కన్వెన్షన్ హాల్‌లో భారీ బీసీ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు మద్దతుగా, దూదేకుల నూర్భాష జమ్మికుంట మండల అధ్యక్షుడు మహమ్మద్ బందే అలీ ఆధ్వర్యంలో ఈ రోజు పోస్టర్‌ను ఆవిష్కరించారు. గుల్జార్ మస్జిద్ (జామ మస్జిద్) అధ్యక్షుడు హుస్సేన్ ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు.మహమ్మద్ బందే […]
కరీంనగర్: వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. కరీంనగర్‌లోని ఓ బాంకెట్ హాల్‌లో జరిగిన WJI సర్వసభ్య సమావేశంలో ఈ నియామకాలు జరిగాయి. ప్రపంచంలోనే శక్తివంతమైన బీఎంఎస్ (BMS) అనుబంధ సంఘంగా WJI గుర్తింపు పొందింది.ఈ సమావేశంలో సీనియర్ పాత్రికేయులు నర్సిని కేదారి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషినూతనంగా ఎన్నికైన నర్సిని కేదారి ఈ సందర్భంగా మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు […]
జమ్మికుంట: ప్రపంచ మూర్ఛ వ్యాధి దినోత్సవం సందర్భంగా, జమ్మికుంటలోని అమృత న్యూరో హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ కందికొండ రాజేందర్ (DM న్యూరాలజిస్ట్) మూర్ఛ వ్యాధి (Epilepsy) గురించి సమాజంలో ఉన్న అపోహలను తొలగిస్తూ, సరైన చికిత్స ప్రాముఖ్యతపై సందేశం ఇచ్చారు.డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ, మూర్ఛ అనేది అన్ని వయసుల వారికీ రావొచ్చని, దీనికి కారణాలు కూడా పలు రకాలుగా ఉంటాయని వివరించారు. చిన్నపిల్లలలో అధిక జ్వరం, మెదడులో నిర్మాణ సంబంధిత సమస్యలు లేదా జన్యుపరమైన కారణాల వల్ల […]
జమ్మికుంట: బీసీల హక్కులు, రిజర్వేషన్లు ప్రజాస్వామిక హక్కు అనే నినాదంతో ఈనెల 19న (బుధవారం) ఇందిరా నగర్‌లోని దినేష్ కన్వెన్షన్ హాల్‌లో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో భారీ బీసీ సదస్సు జరగనుంది. ఈ సదస్సును రాజకీయాలకు అతీతంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల బీసీలు హాజరై విజయవంతం చేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శనిగరపు తిరుపతయ్య కోరారు.సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు […]
వావిలాల: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జమ్మికుంటలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక వైద్య శిబిరం జరిగింది. వైద్యాధికారి డాక్టర్ వరుణ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరంలో 43 మంది వృద్ధులకు రక్తపోటు, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ వరుణ మాట్లాడుతూ, వృద్ధులు శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ప్రతిరోజూ నడక, ధ్యానం, ఉదయపు ఎండలో గడపడం వంటి వ్యాయామాలు చేయాలని సూచించారు. […]
జమ్మికుంట: భవన నిర్మాణ సంక్షేమ బోర్డు స్కీమ్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతుల రద్దుతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జమ్మికుంట CITU మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.CITU జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల కోసం జమ్మికుంట పట్టణంలో ప్రత్యేక అడ్డా స్థలం కేటాయించాలని, అక్కడ మంచినీరు, టాయిలెట్స్ వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సంక్షేమ బోర్డు […]
జమ్మికుంట: ఆధునిక కాలంలో రైతులకు డ్రోన్ స్ప్రే పై అవగాహన కల్పించి,వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దాలని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం రోజున జమ్మికుంట పట్టణంలోని డ్రోన్ స్ప్రే నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా డ్రోన్ స్ప్రే వలన కలిగే లాభాలు,రైతుకు ఏ విధంగా వీటి వాడకం వల్ల ఉపయోగం కలుగుతుందో తెలియజేయాలని నిర్వహుకుణ్ణి కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని,ఇలాంటి ఆధునిక యంత్రాలతో రైతులకు మరింత లాభసాటిగా చేయాలని […]
జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ & పీజి కళాశాల, జమ్మికుంటలో ఖాళీగా ఉన్న M.Sc. జువాలజీ మరియు M.Sc. బోటనీ కోర్సుల్లో ప్రవేశం కోసం స్పాట్ అడ్మీషన్లు నిర్వహించనున్నారు.ఈ నెల 18వ తేదీ మంగళవారం ఉదయం 10:00 గంటలకు కళాశాలలో ఈ ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తుదారులు CPGET – 2025లో అర్హత పొంది ఉండాలి లేదా డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అడ్మిషన్ పొందిన విద్యార్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్సు ఫీజు మొత్తాన్ని చెల్లించాల్సి […]
జమ్మికుంట మండలం తనుగుల క్రాస్ వద్ద జరిగిన ఆటో ట్రాలీ బోల్తా ఘటనలో గాయపడిన ఎల్భాక గ్రామస్థులను హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పరామర్శించారు. జమ్మికుంటలోని వరుణ్ సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన కలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి డాక్టర్లను కోరారు.
జమ్మికుంట: హుజూరాబాద్‌కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ శనివారం జమ్మికుంట మండలంలోని 8 జిల్లా పరిషత్ హైస్కూళ్లు, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లను పంపిణీ చేసింది.ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న 227 మందికి, ఇంటర్మీడియట్ చదువుతున్న 160 మందికి కలిపి మొత్తం 387 పరీక్ష ప్యాడ్‌లను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ చేతుల మీదుగా జరిగింది. ఈ […]