Category: News

Oct 16
ఈనాడు ‘ప్రతిభ పాటవ’ చిత్రలేఖన పోటీల్లో విద్యోదయ పాఠశాల విద్యార్థులకు బహుమతులు

16 అక్టోబర్ 2025జమ్మికుంట: ఈనాడు పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రతిభ పాటవ’ చిత్రలేఖన పోటీల్లో జమ్మికుంటలోని విద్యోదయ పాఠశాల (VIDYODAYA SCHOOLS) విద్యార్థులు తమ ప్రతిభను చాటి బహుమతులు గెలుచుకున్నారు.పిల్లలకు ఇష్టమైన పండుగల అంశంపై నిర్వహించిన ఈ చిత్రలేఖన పోటీల్లో 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరిలో పలువురు విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు.పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ యేభూషి ఆర్యన్ కౌశిక్ బహుమతులను ప్రదానం […]

Oct 16
జమ్మికుంట ప్రభుత్వ పాఠశాలలో సీపీఆర్‌, సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు

16 అక్టోబర్ 2025జమ్మికుంట: ఉమ్మడి కరీంనగర్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్, జిల్లా మేనేజర్ ఇమ్రాన్ ఆదేశాల మేరకు, జమ్మికుంటలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సీపీఆర్‌ (CPR) మరియు సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని 108 ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ఐలావెని కుమారస్వామి, అమిరిశెట్టి బద్రీనాథ్, మరియు పైలెట్లు సిహెచ్. సంపత్ రెడ్డి, బి. రమేష్ నిర్వహించారు. విద్యార్థులకు అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్స అందించే విధానం, ముఖ్యంగా సీపీఆర్‌ పద్ధతిని […]

Oct 15
జమ్మికుంటలో పోగొట్టుకున్న మొబైల్ బాధితురాలికి అప్పగింత

తేదీ 15-10-2025జమ్మికుంట:జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ నేతృత్వంలో పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందజేశారు.వివరాల్లోకి వెళితే, జమ్మికుంట గ్రామానికి చెందిన లకిడి వీణ రాణి (భర్త విజయ్) తన వివో మొబైల్ ఫోన్‌ను జమ్మికుంటలో పోగొట్టుకున్నారు. ఆమె వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా, టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ కేసును స్వీకరించారు.ఐఎంఈఐ (IMEI) నంబర్ ఆధారంగా సి.ఇ.ఐ.ఆర్ (CEIR) పోర్టల్ ద్వారా పోలీసులు గాలింపు చేపట్టారు. పోగొట్టుకున్న మొబైల్‌ను […]

Oct 15
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గూడెపు సారంగపాణి దరఖాస్తు

కరీంనగర్, అక్టోబరు 15, 2025:కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం గూడెపు సారంగపాణి తన దరఖాస్తును ఏఐసీసీ అబ్జర్వర్స్‌కు సమర్పించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అబ్జర్వర్స్‌ను కలిసిన సారంగపాణి, పార్టీ బలోపేతానికి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తానని వారికి వివరించారు.ఈ సందర్భంగా గూడెపు సారంగపాణి మాట్లాడుతూ.. తాను 33 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశానని తెలిపారు. హుజురాబాద్, కమలాపూర్ నియోజకవర్గాల పరిధిలో ఎన్ఎస్‌యూఐ విద్యార్థి ప్రెసిడెంట్‌గా, […]

Oct 15
ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అథ్లెటిక్స్ స్టేడియం నిర్మించరాదు – విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్‌

జమ్మికుంట, సెప్టెంబర్ 15, 2025:జమ్మికుంట పట్టణంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అథ్లెటిక్స్ మినీ స్టేడియం నిర్మించాలనే కలెక్టర్ ఆదేశాలను నిరసిస్తూ… అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు (జేఏసీ) ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు ఆదేశాలు కళాశాల ప్రిన్సిపల్‌కు అందినట్లు తెలుసుకున్న జమ్మికుంట అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు వెంటనే కళాశాలకు వెళ్లి ప్రిన్సిపల్‌కు వినతిపత్రం అందజేశారు. ముందుగా ఆక్రమణల తొలగింపు చేపట్టాలి: విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్‌ తదనంతరం మీడియాతో మాట్లాడుతూ… గత కొన్ని […]

Oct 15
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ‘వెల్కమ్ పార్టీ’

జమ్మికుంట, అక్టోబర్ 15, 2025:స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు విద్యార్థులు ‘వెల్కమ్ పార్టీ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కరీంనగర్ జిల్లా డివిజనల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (DIEO) గంగాధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.విద్యార్థులను ఉద్దేశించి DIEO గంగాధర్ ప్రసంగిస్తూ… విద్యార్థులు మంచిగా చదువుకొని, కళాశాల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచి, జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. కష్టపడి చదవడం ద్వారానే ఉన్నత ఫలితాలను సాధించవచ్చని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ […]

Oct 14
జమ్మికుంట మార్కెట్ కమిటీలో పత్తి వ్యాపారస్థులతో కీలక సమావేశం: రైతులకు గిట్టుబాటు ధరపై ఛైర్‌పర్సన్ హెచ్చరిక

తేదీ: అక్టోబర్ 14, 2025జమ్మికుంట: రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పత్తి క్రయవిక్రయాలపై చర్చించేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ), జమ్మికుంట ఛైర్‌పర్సన్ శ్రీమతి పుల్లూరి స్వప్న – సదానందం గారు మరియు పాలకవర్గం అధ్యక్షతన ఈ రోజు (అక్టోబర్ 14, 2025) సాయంత్రం 5:00 గంటలకు కాటన్ మార్కెట్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పత్తి వ్యాపారస్థులు, ట్రేడర్లు, మరియు అర్తి దారులు పాల్గొన్నారు.ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ, రైతులకు న్యాయం జరగాలని, మంచి గిట్టుబాటు ధరలు […]

Oct 14
జమ్మికుంటలో ఆర్‌ఎస్‌ఎస్ ‘పదసంచలనం’ వైభవంగా నిర్వహణ

అక్టోబర్ 14, 2025జమ్మికుంట:రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జమ్మికుంట ఖండం ఆధ్వర్యంలో పట్టణంలో పదసంచలనం (రూట్ మార్చ్) వైభవంగా జరిగింది.శ్రీ సరస్వతి శిశు మందిర్ నుంచి పురవీధుల గుండా స్వయంసేవకులు క్రమశిక్షణతో కూడిన కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ దాసరి రవీందర్, ముఖ్య అతిథి డాక్టర్ ముక్క రాజేశ్వరయ్య, ప్రధాన వక్త దేవుని మురళి సహా దాదాపు 200 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు.ఆర్‌ఎస్‌ఎస్ చేపట్టిన ఈ కవాతుకు జమ్మికుంట పట్టణ […]

Oct 14
బీజేపీ నాయకులపై పోలీస్ లకు పిర్యాదు

జమ్మికుంట/హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) నాయకులు మంగళవారం, అక్టోబర్ 14, 2025న పోలీసులకు ఫిర్యాదు చేశారు.జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్, మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావులు మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ […]

Oct 13
జిల్లా స్థాయిలో జమ్మికుంట క్రీడాకారుల సత్తా: అండర్-14 బాలికల కబడ్డీలో రెండో స్థానం!

జమ్మికుంట/కోరపల్లి: జిల్లా స్థాయిలో జరిగిన క్రీడా పోటీలలో జమ్మికుంట మండలానికి చెందిన క్రీడాకారులు తమ సత్తా చాటారు. ముఖ్యంగా, మండలంలోని కోరపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. అండర్-14 కబడ్డీలో సత్తాజిల్లా స్థాయిలో నిర్వహించిన అండర్-14 బాలికల కబడ్డీ పోటీల్లో జమ్మికుంట బాలికల జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండో స్థానంలో నిలిచింది. ఫైనల్ వరకు దూసుకెళ్లిన ఈ జట్టు రన్నరప్‌గా నిలవడం పట్ల స్థానికులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.జట్టు సభ్యుల పట్టుదల, […]

Listings News Offers Jobs Contact