Category: News

Oct 20
మంగళవారం ఉచిత ఓ.పి. సేవలు – ఆదిత్య ఆసుపత్రి, జమ్మికుంటలో గర్భిణీ, సాధారణ మహిళల కోసం ప్రత్యేక అవకాశం

జమ్మికుంట: ఆదిత్య ఆసుపత్రి మహిళలకు శుభవార్త తెలిపింది. ఇకపై ప్రతి మంగళవారం ఆసుపత్రిలో ఉచిత ఓ.పి. (ఔట్‌ పేషెంట్) సేవలు అందుబాటులో ఉంటాయని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.ఈ సదావకాశాన్ని గర్భిణీ మహిళలు మరియు సాధారణ మహిళలు సద్వినియోగం చేసుకోవచ్చని ఆదిత్య ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.మంగళవారం రోజున ఆసుపత్రికి వచ్చే మహిళలు ఎటువంటి ఫీజు లేకుండా వైద్యుల సలహాలు, సూచనలు పొందవచ్చని ఆసుపత్రి వర్గాలు […]

Oct 20
జమ్మికుంట-వావిలాల రోడ్డు గుంతల మరమ్మతులు

జమ్మికుంట: జమ్మికుంట నుండి వావిలాల వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డులో చిన్నకోమిటిపల్లి నుండి నాగంపేట మధ్యభాగంలో ఏర్పడిన గుంతల కారణంగా రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కాంట్రాక్టర్‌ తోట లక్ష్మణ్ (గండ్రపల్లి), జేసీబీ సహాయంతో రహదారిలోని గుంతలను మోరంతో పూడ్చే పనులు ప్రారంభించారు.ఈ మరమ్మత్తుల కార్యక్రమంలో శ్యాంపేట్ మాజీ సర్పంచ్ దేవేందర్ రావు, నాగంపేట మాజీ సర్పంచ్ చిన్న కృష్ణా రెడ్డి, అలాగే ఉపాధ్యాయుడు చంద్రమోహన్ పాల్గొన్నారు.

Oct 19
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు: బీసీ నాయకులు

జమ్మికుంట: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేంతవరకు పోరాటం ఆగదని బీసీ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బేట రవీందర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టంగుటూరి రాజ్ కుమార్, మండల అధ్యక్షుడు ఏ బూసి శ్రీనివాస్ స్పష్టం చేశారు. జమ్మికుంటలోని చాణక్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.ఈ నెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన జమ్మికుంట బంద్ స్వచ్ఛందంగా, సంపూర్ణంగా జరిగిందని తెలిపారు. ఈ బంద్‌కు […]

Oct 18
ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో కిడ్నీ స్పెషలిస్ట్ సేవలు

అక్టోబర్ 18, 2025జమ్మికుంట: కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి జమ్మికుంటలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ కిడ్నీ స్పెషలిస్ట్ డా. గీతాంజలి నరేష్ ప్రతి ఆదివారం ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జమ్మికుంట నందు రోగులకు అందుబాటులో ఉంటున్నారు.కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం ఇకపై కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వంటి పెద్ద పట్టణాలకు వెళ్లవలసిన అవసరం లేదని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది. జమ్మికుంటలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని […]

Oct 18
కరీంనగర్లో ఏఐసీసీ పరిశీలకులను కలిసిన వొడితల ప్రణవ్

కరీంనగర్ జిల్లా (అక్టోబర్ 18, 2025): కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై అభిప్రాయ సేకరణహుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కరీంనగర్లో ఏఐసీసీ పరిశీలకులు మానే శ్రీనివాస్, పీసీసీ ప్రతినిధులు, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణను మర్యాదపూర్వకంగా కలిశారు.కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి అభిప్రాయ సేకరణ నిమిత్తం ఏఐసీసీ పరిశీలకులు, పీసీసీ ప్రతినిధులు కరీంనగర్‌కు విచ్చేసిన సందర్భంగా ఈ భేటీ జరిగింది. జిల్లా […]

Oct 18
లెదర్ ఇండస్ట్రీస్ పార్కులను వెంటనే పునరుద్ధరించాలి: మాదిగ హక్కుల దండోరా

2025 అక్టోబర్ 18కరీంనగర్ జిల్లా, జమ్మికుంట: లెదర్ పార్కులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకురావాలని మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్‌డి) జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.జమ్మికుంట గాంధీ చౌరస్తాలో లెదర్ పార్క్ సాధన చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలో పాల్గొన్న సందర్భంగా వారు మాట్లాడారు. సుమారు 11 సంవత్సరాల క్రితం చర్మకారుల అభివృద్ధి కోసం ఉమ్మడి […]

Oct 18
బీసీలను మోసం చేస్తున్నది బీజేపీయే: సీపీఎం మండల కార్యదర్శి శీలం అశోక్

జమ్మికుంట, అక్టోబర్ 18 (జమ్మికుంటలోకల్.కామ్): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ, బీసీలను మోసం చేస్తోందని సీపీఎం మండల కార్యదర్శి శీలం అశోక్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, గవర్నర్‌కు పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించకపోవడం సిగ్గుచేటని అన్నారు.42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మోత్కులగూడెం చౌరస్తా నుండి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వరకు బైక్ ర్యాలీ […]

Oct 18
బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలి: బీసీ సంఘాల జేఏసీ

2025 అక్టోబర్ 18ఇల్లందకుంట: బీసీల రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఇల్లందకుంట మండల కేంద్రంలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత బంద్ జరిగింది. ఈ బంద్‌లో బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్, సీపీఐ, ఎంఆర్‌పిఎస్, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పెద్ది కుమార్, ఇంగ్లే రామారావు, అన్నం ప్రవీణ్, గుండ్ల గణపతి, తిరుమల మాట్లాడుతూ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. […]

Oct 17
తెలంగాణ బంద్‌లో కరీంనగర్ బీసీ కులస్తులంతా పాల్గొనాలి – పొనగంటి సంపత్

17 అక్టోబర్ 2025బీసీల ఉద్యమాలన్నింటికీ బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుంది: సింగిల్ విండో చైర్మన్కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్‌లో సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్, కొత్తపల్లి మాజీ సర్పంచ్ బొద్దుల రవీందర్, మాజీ ఎంపీటీసీ తోట లక్ష్మణ్ మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం అమలు కాకుండా జరుగుతున్న కుట్రలకు నిరసనగా బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు (18) జరగబోయే తెలంగాణ బంద్‌ను పాటించాలని వారు […]

Oct 16
ఘనంగా మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు పొనగంటి మల్లయ్య జన్మదిన వేడుకలు

October 16, 2025జమ్మికుంట: పట్టణంలోని 22వ వార్డు అంబేడ్కర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గుల్లి ప్రతాప్ ఆధ్వర్యంలో మల్లయ్య జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ప్రతాప్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మనసున్న పొనగంటి మల్లయ్య నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం మల్లయ్యను శాలువాతో సన్మానించి సత్కరించారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, యూత్ సభ్యులు ఇల్లందుల శ్రీనివాస్, శశి కుమార్, రవిబాబు, రాజు, […]

Listings News Offers Jobs Contact