Crime News
జమ్మికుంట మండలం తనుగుల క్రాస్ వద్ద జరిగిన ఆటో ట్రాలీ బోల్తా ఘటనలో గాయపడిన ఎల్భాక గ్రామస్థులను హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పరామర్శించారు. జమ్మికుంటలోని వరుణ్ సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన కలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి డాక్టర్లను కోరారు.
జమ్మికుంట: పట్టణంలోని ‘సెరా లైఫ్’ క్లినిక్‌ను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, డాక్టర్ చందు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నడుపుతున్నట్లు గుర్తించి, వెంటనే మూసివేయాలని ఆదేశించారు. చట్టపరమైన రిజిస్ట్రేషన్ వచ్చేవరకు క్లినిక్ తెరవకూడదని నిర్వాహకుడికి సూచించారు. ప్రజలు అర్హత గల వైద్యుల వద్దే వైద్యం చేయించుకోవాలని, ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ తనిఖీలో సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్ రాజు, సిబ్బంది నరేందర్ పాల్గొన్నారు.
జమ్మికుంట: మండలంలోని రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లలో అన్నదాతలను నిలువునా దోపిడీ చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, మిల్లర్లు ప్రతి క్వింటాల్‌కు 5 నుండి 8 కిలోలు అదనంగా కాటా వేస్తున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్లపై వెంటనే విజిలెన్స్ తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఐకేపీ సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, […]
జమ్మికుంట: జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అదృశ్యం కావడంతో కేసు నమోదైంది. మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల పోచయ్య అనే వ్యక్తి తన కూతురు అంబాల నిర్మల (భర్త రాజు, వయసు 32) కనిపించడం లేదంటూ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. 🔍 కేసు వివరాలుపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: 🚨 పోలీసుల స్పందనతండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.జమ్మికుంట CI రామకృష్ణ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. మహిళ ఆచూకీ […]
జమ్మికుంట: స్వామి వివేకానంద పాఠశాల హాస్టల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని అధికారులను కోరినా, వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై BRSV రాష్ట్ర నాయకులు ఆవుల తిరుపతి యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పాఠశాల యజమాన్యం కనీసం స్పందించకపోవడం, అధికార యంత్రాంగం మద్దతుగా నిలవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రైవేట్ పాఠశాలలు ధన దాహంతో విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని విస్మరిస్తున్నాయని […]
జమ్మికుంట: నగురం గ్రామానికి చెందిన ఆకుల స్వామి (వయసు 51, తండ్రి గోపాల్) కుటుంబ గొడవల కారణంగా మనస్తాపం చెంది అక్టోబర్ 27, 2025న ఇంటి నుండి వెళ్లిపోయారు. ఎన్ని రోజులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, ఆయన సోదరుడు ఆవుల రమేష్ నవంబర్ 1, 2025న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, ఆకుల స్వామి కోసం గాలిస్తున్నారు.
జమ్మికుంట: అక్టోబరు 13, 2025 న విలాసాగర్ గ్రామానికి చెందిన ఐలవేణి రమేష్ (తండ్రి: సాయిలు) జమ్మికుంటలో పోగొట్టుకున్న ఒప్పో మొబైల్‌ను పోలీసులు తిరిగి అందించారు.టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో, మొబైల్‌ను ఐఎంఈఐ నంబర్ ద్వారా సీఈఐఆర్ పోర్టల్ (CEIR PORTAL) సహాయంతో గుర్తించారు. మొబైల్ పోగొట్టుకున్నవారు వెంటనే ఈ పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని ఇన్స్పెక్టర్ రామకృష్ణ సూచించారు.
తేదీ 15-10-2025జమ్మికుంట:జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ నేతృత్వంలో పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందజేశారు.వివరాల్లోకి వెళితే, జమ్మికుంట గ్రామానికి చెందిన లకిడి వీణ రాణి (భర్త విజయ్) తన వివో మొబైల్ ఫోన్‌ను జమ్మికుంటలో పోగొట్టుకున్నారు. ఆమె వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా, టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ కేసును స్వీకరించారు.ఐఎంఈఐ (IMEI) నంబర్ ఆధారంగా సి.ఇ.ఐ.ఆర్ (CEIR) పోర్టల్ ద్వారా పోలీసులు గాలింపు చేపట్టారు. పోగొట్టుకున్న మొబైల్‌ను […]
జమ్మికుంట: విలాసాగర్ గ్రామ శివారులో జాతీయ పక్షి నెమలి మృతదేహం లభ్యం.
అత్తింట్లో అరాచకం… భూతవైద్యం పేరుతో యువతికి చిత్రహింసలు జమ్మికుంట పోలీసుల అదుపులో భూత వైద్యుడు..? కరీంనగర్ జిల్లా: శంకరపట్నం మండల కేంద్రంలోని గద్దపాక గ్రామానికి చెందిన కనుకుంట్ల రజిత కు దెయ్యం పట్టిందని బాలింతని చూడకుండ భూత వైద్యం పేరిట అత్తింటి కుటుంబ సభ్యులు తీవ్రంగ కొట్టిన చిత్రహింసలు చేసారు. ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో బాధితురాలు స్పృహ కోల్పోయింది. కుటుంబ సభ్యులు బాధితురాలు ను కరీంనగర్ ప్రయివేటు హాస్పిటల్ కి తరలించారు. చిత్ర హింసలకు గురి చేసిన […]