జమ్మికుంట: పట్టణంలోని 8వ వార్డు మారుతినగర్‌లో దెబ్బతిన్న మంచినీటి పైప్‌లైన్‌కు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఆదేశాలతో సత్వరమే మరమ్మతులు చేపట్టారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కొలుగూరి సురేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రమేష్, మంచినీటి సరఫరా సిబ్బంది పాల్గొన్నారు.
జమ్మికుంట, అక్టోబర్ 27: తెలంగాణ క్యాపిటల్ గ్రూప్ ఆఫ్ మీడియా, BSK ఫౌండేషన్ చైర్మన్, నవ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను జమ్మికుంటలో ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద విగ్రహం వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బొమ్మల గుడిలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, పేదలకు ఆయన చేస్తున్న సేవలను పలువురు కొనియాడారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.