జమ్మికుంట: పట్టణంలోని పద్మశాలి వీధిలో సుభాష్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ సత్కార్యానికి YuppTV, Turito అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి రూ.51,116 విరాళం అందించారు. మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సుభాష్ యూత్ ప్రతినిధులు, కమిటీ సభ్యులు, పాడి ఉదయ్ నందన్ రెడ్డి బృందం పాల్గొన్నారు.
హుజురాబాద్: ప్రజా పాలన పేరుతో ప్రజలపై ఆర్టీసీ చార్జీల భారం మోపడం సరికాదని సీపీఎం హుజురాబాద్ మండల కార్యదర్శి కొప్పుల శంకర్ అన్నారు. హుజురాబాద్ నుంచి కరీంనగర్ ప్రయాణికులపై పెంచిన బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కొత్తగట్టు టోల్ భారం ప్రభుత్వమే భరించాలని, ప్రయాణికులపై మోపవద్దని కోరారు. చార్జీలు తగ్గించకపోతే ప్రజాగ్రహాన్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.