హుజూరాబాద్: పేదవారి పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. చెక్కుల పంపిణీలో జాప్యం చేయబోమని ఆయన స్పష్టం చేశారు. శనివారం, కాంగ్రెస్ కార్యాలయంలో రూ. 47,62,000/- విలువ గల 135 ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ప్రణవ్ స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులు ఈ చెక్కులను అందుకున్నారు. పేదలకు అండగా ఉండటం తమ కర్తవ్యమని ప్రణవ్ పేర్కొన్నారు. లబ్ధిదారులు […]