జమ్మికుంట, నవంబర్ 13, 2025: చదువు ప్రతి ఒక్కరి హక్కు అని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి భావి భారత పౌరులుగా ఎదగాలని PSK ఫౌండేషన్ వ్యవస్థాపకులు పొనగంటి సాత్విక్ పటేల్ పిలుపునిచ్చారు. పొనగంటి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం మండల ప్రాథమిక పాఠశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట టౌన్ ఎస్ఐ సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు […]