జమ్మికుంట: జమ్మికుంట నుండి వావిలాల వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డులో చిన్నకోమిటిపల్లి నుండి నాగంపేట మధ్యభాగంలో ఏర్పడిన గుంతల కారణంగా రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కాంట్రాక్టర్ తోట లక్ష్మణ్ (గండ్రపల్లి), జేసీబీ సహాయంతో రహదారిలోని గుంతలను మోరంతో పూడ్చే పనులు ప్రారంభించారు.ఈ మరమ్మత్తుల కార్యక్రమంలో శ్యాంపేట్ మాజీ సర్పంచ్ దేవేందర్ రావు, నాగంపేట మాజీ సర్పంచ్ చిన్న కృష్ణా రెడ్డి, అలాగే ఉపాధ్యాయుడు చంద్రమోహన్ పాల్గొన్నారు.