జమ్మికుంట: మడిపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని కోరారు. ప్రజా ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుందని తెలిపారు. నేరెళ్ల రాజమల్లు, ఎగ్గెటి సదానందం పాల్గొన్నారు.