Tag: Karimnagar District President

Sep 26
తప్పుడు ప్రచారాలపై ఇమ్రాన్ ఆగ్రహం

జమ్మికుంట, 26 సెప్టెంబర్ 2026: తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఇమ్రాన్ ఆరోపించారు. అసత్య పోస్టులతో తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామికి అండగా ఉండటం, పార్టీ నాయకులను కలవడాన్ని కొందరు వివాదాస్పదంగా చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని, ప్రచారం కొనసాగితే చట్టపరంగా ఎదుర్కొంటానని హెచ్చరించారు.

Sep 25
కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడికి సన్మానం

కరీంనగర్ జిల్లా కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన బచ్చు భాస్కర్‌ను జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భాస్కర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు చింతల శ్రీనివాస్, చందా రాజు, దిడ్డి రాము తదితరులు పాల్గొన్నారు.

Listings News Offers Jobs Videos