Tag: Jubilee hills by elections

Nov 14
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయంతో ఇల్లందకుంటలో పార్టీ శ్రేణుల సంబరాలు!

ఇల్లందకుంట: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా, ఇల్లందకుంట మండలంలో కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం భారీ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.హుజూరాబాద్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకొని, బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యూహం, సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, […]

Nov 14
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయం… అభివృద్ధికి నిదర్శనం!

జమ్మికుంట: తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుపై కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మేనిఫెస్టో హామీల ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారనడానికి ఈ విజయమే నిదర్శనమని ఆయన అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సదయ్య ధీమా వ్యక్తం చేశారు.

Nov 14
జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ విజయం: జమ్మికుంటలో కాంగ్రెస్ సంబరాలు!

జమ్మికుంట: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.టపాసులు కాల్చి, స్వీట్లు పంచుతూ, సౌండ్‌ బాక్సుల నడుమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పార్టీ పెద్దలందరికీ, జూబ్లీహిల్స్ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిని చూసే ప్రజలు నవీన్ యాదవ్‌ను గెలిపించారని, రానున్న స్థానిక […]

Nov 12
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం యూసఫ్‌గూడలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఆయన తన అనుచరులతో కలిసి హల్‌చల్ సృష్టించారు.పోలీసులు అడ్డుకున్నప్పటికీ, ఆయన సిబ్బందిని తోసేసి కేంద్రంలోకి చొరబడేందుకు ప్రయత్నించారని ఆరోపణ. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కౌశిక్‌రెడ్డిపై అక్రమ ప్రవేశం (ట్రెస్పాస్), పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులు నమోదు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద […]

Nov 08
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో దేశిని కోటి

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్, దేసిని కోటి ఆధ్వర్యంలో ప్రచారం ఉధృతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దొంత రమేష్, జిల్లెల్ల తిరుపతిరెడ్డి, బొంగోని వీరన్న, మర్రి రామ్ రెడ్డి, పంజాల అజయ్, కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటమ్ ఝాన్సీ రవీందర్ సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Nov 07
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: బీజేపీ కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ ఎన్నికల ప్రచారం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి లంకెలా దీపక్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు క్రాంతి కిరణ్లను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా జమ్మికుంటకు చెందిన బీజేపీ కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ బోరబండ బస్తీ వాసులతో సమావేశమై, బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం అపార్ట్‌మెంట్ వాసుల కోసం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో బీజేపీ అభ్యర్థి లంకెలా దీపక్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర […]

Listings News Offers Jobs Contact