మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రేపు (నవంబర్ 06, 2025) హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ఉదయం 11:00 గంటలకు, కమలాపూర్ మండల కేంద్రంలోని రావిచెట్టు వద్ద (ఈటల నివాసం సమీపంలో) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏర్పాటు చేసిన భారీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ వివరాలను ఎంపీ ఈటల రాజేందర్ పి.ఎ. నరేందర్ తెలిపారు.
హుజూరాబాద్: పేదవారి పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. చెక్కుల పంపిణీలో జాప్యం చేయబోమని ఆయన స్పష్టం చేశారు. శనివారం, కాంగ్రెస్ కార్యాలయంలో రూ. 47,62,000/- విలువ గల 135 ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ప్రణవ్ స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులు ఈ చెక్కులను అందుకున్నారు. పేదలకు అండగా ఉండటం తమ కర్తవ్యమని ప్రణవ్ పేర్కొన్నారు. లబ్ధిదారులు […]
కరీంనగర్ జిల్లా (అక్టోబర్ 18, 2025): కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై అభిప్రాయ సేకరణహుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కరీంనగర్లో ఏఐసీసీ పరిశీలకులు మానే శ్రీనివాస్, పీసీసీ ప్రతినిధులు, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణను మర్యాదపూర్వకంగా కలిశారు.కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి అభిప్రాయ సేకరణ నిమిత్తం ఏఐసీసీ పరిశీలకులు, పీసీసీ ప్రతినిధులు కరీంనగర్‌కు విచ్చేసిన సందర్భంగా ఈ భేటీ జరిగింది. జిల్లా […]
జమ్మికుంట, అక్టోబర్ 11, 2025:బీఆర్‌ఎస్‌వీ యూత్ నాయకులు జవ్వాజి కుమార్ (JK) మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై హుజూరాబాద్‌లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటల బీసీ రిజర్వేషన్లపై ‘మొసలి కన్నీరు’ కారుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ‘నువ్వు కొట్టినట్లు చేయి, నేను ఏడ్చినట్లు చేస్తా’ అనే డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు.ఈటల బీసీ ముసుగులో ఉన్న దొర అని కుమార్ ధ్వజమెత్తారు. “బీసీల పేరు చెప్పుకుని వేల కోట్లు సంపాదించారు. రెండు ఎకరాల నుండి వేల ఎకరాలు […]
BRS పార్టీ మండలాల కార్యకర్తల సమావేశం – స్థానిక సంస్థల ఎన్నికల సమావేశం! 🗓 తేదీ: 05-10-2025 🔹 ఇల్లంతకుంట మండలం⏰ సమయం: ఉదయం 10:00 గంటలకు📍 స్థలం: లక్ష్మీనరసింహస్వామికల్యాణ మండపం (చిన్న కోమటిపల్లి గుట్ట ) 🔹 జమ్మికుంట మండలం⏰ సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు📍 స్థలం: MPR గార్డెన్ (జమ్మికుంట) సమావేశాని కి BRS పార్టీ కార్యకర్తలు KCR అభిమానులు అందరూ పాల్గొనాలని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి పిలుపు.