Tag: Electricity Employees

Nov 12
సామాజిక స్పృహ చాటిన విద్యుత్ ఉద్యోగులు

జమ్మికుంట: జమ్మికుంట-పెద్దపల్లి ప్రధాన రోడ్డుపై నాగంపేట కూడలి వద్ద ఏర్పడిన గుంతను తనుగుల సెక్షన్ విద్యుత్ ఉద్యోగులు పూడ్చి సామాజిక స్పృహ చాటుకున్నారు. వర్షాలకు ఏర్పడిన ఈ పెద్ద గుంతతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. బేకరీ యజమాని రవి విజ్ఞప్తి మేరకు, బిజిగిరి షరీఫ్ లైన్ మెన్ విజ్జిగిరి అంజయ్య, ఏఎల్ఎం రమేష్ బాబు, సతీష్ సహా ఇతర ఉద్యోగులు లంచ్ సమయంలో కంకర, సిమెంట్‌తో గుంతను పూడ్చివేశారు. వీరి సేవను స్థానికులు, వాహనదారులు హర్షించారు.

Listings News Offers Jobs Contact