జమ్మికుంట: పట్టణంలోని ‘సెరా లైఫ్’ క్లినిక్‌ను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, డాక్టర్ చందు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నడుపుతున్నట్లు గుర్తించి, వెంటనే మూసివేయాలని ఆదేశించారు. చట్టపరమైన రిజిస్ట్రేషన్ వచ్చేవరకు క్లినిక్ తెరవకూడదని నిర్వాహకుడికి సూచించారు. ప్రజలు అర్హత గల వైద్యుల వద్దే వైద్యం చేయించుకోవాలని, ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ తనిఖీలో సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్ రాజు, సిబ్బంది నరేందర్ పాల్గొన్నారు.