Category: News

Oct 12
బిజెపి ‘ఓట్ చోర్’కు వ్యతిరేకంగా జమ్మికుంటలో కాంగ్రెస్ నిరసన!

జమ్మికుంట (హుజూరాబాద్), అక్టోబర్ 12, 2025:ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు సూచనల మేరకు జమ్మికుంటలో బ్లాక్ కాంగ్రెస్, పట్టణ మండల కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో “ఓట్ చోర్” కార్యక్రమం నిర్వహించారు.దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఓట్లను అక్రమంగా తొలగిస్తూ ‘చోర్’ చేస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై తమ నాయకులు రాహుల్ గాంధీ ఇప్పటికే ఆధారాలతో భారత ఎన్నికల సంఘానికి (ఈసీ) పలుమార్లు […]

Oct 12
హుజూరాబాద్‌లో ఈటెల కుట్రలు: కౌశిక్ రెడ్డిపై క్షుద్ర రాజకీయం – పొనగంటి సంపత్

(అక్టోబర్ 12, 2025, జమ్మికుంట లోకల్)జమ్మికుంట: నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని జమ్మికుంట సింగిల్ విండో ఛైర్మన్ పొనగంటి సంపత్ తీవ్రంగా ఆరోపించారు. రాజకీయ రంగప్రవేశం చేసిన కొద్ది కాలంలోనే కౌశిక్ రెడ్డి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారని, నిస్వార్థంగా సేవలందిస్తూ నియోజకవర్గానికి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చారని సంపత్ కొనియాడారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఈటెల రాజేందర్ హుజూరాబాద్‌ను “చీడ”లా పట్టిపీడిస్తున్నారని, ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు […]

Oct 11
ఈటల రాజేందర్‌పై బీఆర్‌ఎస్‌వీ యూత్ లీడర్ జవ్వాజి కుమార్ తీవ్ర విమర్శలు

జమ్మికుంట, అక్టోబర్ 11, 2025:బీఆర్‌ఎస్‌వీ యూత్ నాయకులు జవ్వాజి కుమార్ (JK) మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై హుజూరాబాద్‌లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటల బీసీ రిజర్వేషన్లపై ‘మొసలి కన్నీరు’ కారుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ‘నువ్వు కొట్టినట్లు చేయి, నేను ఏడ్చినట్లు చేస్తా’ అనే డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు.ఈటల బీసీ ముసుగులో ఉన్న దొర అని కుమార్ ధ్వజమెత్తారు. “బీసీల పేరు చెప్పుకుని వేల కోట్లు సంపాదించారు. రెండు ఎకరాల నుండి వేల ఎకరాలు […]

Oct 11
జమ్మికుంట KVKలో ‘ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన’ ప్రత్యక్ష ప్రసారం

జమ్మికుంట, (తేదీ 11-10-2025):జమ్మికుంట పట్టణంలోని ప్రకాష్ కృషి విజ్ఞాన కేంద్రం (KVK) లో ఈరోజు “ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన మరియు పప్పుధాన్యాల స్వావలంబన మిషన్ ప్రారంభం” కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ కీలక కార్యక్రమాన్ని స్థానిక శాస్త్రవేత్తలు, బీజేపీ నాయకులు, రైతులు మరియు యువ శాస్త్రజ్ఞులు వీక్షించారు.ఈ సందర్బంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, పశుసంవర్ధకం, మత్స్య సంపద […]

Oct 11
జమ్మికుంట మార్కెట్‌లో ప్రధాని మోదీ ‘ధన్ ధాన్య యోజన’ వీడియో కాన్ఫరెన్స్

జమ్మికుంట, (తేదీ 11-10-2025):జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ‘ధన్ ధాన్య యోజన’ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ముఖ్యమైన కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌తో సహా పలువురు ముఖ్యులు, రైతులు మరియు మార్కెట్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం అధ్యక్షత వహించారు. ఆమెతో పాటు […]

Oct 11
బాలగోపాల్ స్మారక సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

జమ్మికుంట: మానవ హక్కుల వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు జమ్మికుంటలో బాలగోపాల్ 16వ స్మారక సమావేశపు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 12వ తేదీ (ఆదివారం) హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ సదస్సు జరగనుంది.ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ అచ్యుత్ కుమార్ మాట్లాడుతూ, మానవ హక్కుల కోసం బాలగోపాల్ మూడు దశాబ్దాలు కృషి చేశారని కొనియాడారు. ఆర్థిక, సామాజిక, లింగ వివక్ష లేకుండా అందరికీ హక్కులు అందే సమాజం […]

Oct 11
జమ్మికుంట అంగన్వాడీ కేంద్రాల పరిశీలన: పక్కా భవనం కోసం హామీ

జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్, దుర్గ కాలనీల అంగన్వాడీ కేంద్రాలను హుజురాబాద్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ శ్రీపతి నరేష్ ఈరోజు పర్యవేక్షించారు.పిల్లలకు, గర్భిణీలకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారంపై ఆరా తీశారు. కిరాయి భవనంలో కేంద్రం నడుపుతున్నామని, పక్కా అంగన్వాడీ సెంటర్ ఇప్పించాలని టీచర్ శారదా మేడం కోరారు. ఈ సమస్యను మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు ప్రణవ్ బాబు దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే […]

Oct 11
వావిలాలలో పోషణ మాసం: మహిళల ఆరోగ్యంపై అవగాహన, పురుషులకు వంటల పోటీ

వావిలాల అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం సందర్భంగా ప్రత్యేక సభ జరిగింది. హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి పాల్గొన్నారు. తల్లిదండ్రులకు చక్కెర, నూనె, ఉప్పు వాడకంపై, అలాగే పోషకాహారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబానికి రక్ష అని, కుటుంబంలో వారి పాత్ర ముఖ్యమని వక్తలు తెలిపారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరిగే ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని వినియోగించుకుని ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, […]

Oct 09
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా?ఇక మీ గెలుపును ఖాయం చేసుకోండిగ్రామీణ ప్రాంత ప్రజా ప్రతినిధులను అవసరమయ్యే అన్ని ఎలెక్షన్ సర్వీసెస్ అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో 👉 పొలిటికల్ ప్రొఫైల్ క్రీయేషన్👉 వాయిస్ కాల్స్, బల్క్ వాట్సప్, ఎస్. ఏం.ఎస్.👉 డిజిటల్ బ్యానర్, వీడియోస్, రీల్స్ క్రీయేషన్👉 సోషల్ మీడియా మేనేజ్ మెంట్👉 మీడియా కవరేజ్ మరెన్నో సర్వీసెస్ ఇక మీ సమీపంలో .. అవసరం ఉన్న వారు క్రింది వాట్సప్ లింకు క్లిక్ చేయగలరు📱https://wa.me/9154545254?text=I’m%20interested%20in%20your%20services

Oct 05
BRS పార్టీ మండలాల కార్యకర్తల సమావేశం

BRS పార్టీ మండలాల కార్యకర్తల సమావేశం – స్థానిక సంస్థల ఎన్నికల సమావేశం! 🗓 తేదీ: 05-10-2025 🔹 ఇల్లంతకుంట మండలం⏰ సమయం: ఉదయం 10:00 గంటలకు📍 స్థలం: లక్ష్మీనరసింహస్వామికల్యాణ మండపం (చిన్న కోమటిపల్లి గుట్ట ) 🔹 జమ్మికుంట మండలం⏰ సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు📍 స్థలం: MPR గార్డెన్ (జమ్మికుంట) సమావేశాని కి BRS పార్టీ కార్యకర్తలు KCR అభిమానులు అందరూ పాల్గొనాలని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి పిలుపు.

Listings News Offers Jobs Contact