16 అక్టోబర్ 2025జమ్మికుంట: ఉమ్మడి కరీంనగర్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్, జిల్లా మేనేజర్ ఇమ్రాన్ ఆదేశాల మేరకు, జమ్మికుంటలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సీపీఆర్ (CPR) మరియు సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని 108 ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ఐలావెని కుమారస్వామి, అమిరిశెట్టి బద్రీనాథ్, మరియు పైలెట్లు సిహెచ్. సంపత్ రెడ్డి, బి. రమేష్ నిర్వహించారు. విద్యార్థులకు అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్స అందించే విధానం, ముఖ్యంగా సీపీఆర్ పద్ధతిని […]
వావిలాల అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం సందర్భంగా ప్రత్యేక సభ జరిగింది. హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి పాల్గొన్నారు. తల్లిదండ్రులకు చక్కెర, నూనె, ఉప్పు వాడకంపై, అలాగే పోషకాహారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబానికి రక్ష అని, కుటుంబంలో వారి పాత్ర ముఖ్యమని వక్తలు తెలిపారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరిగే ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని వినియోగించుకుని ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, […]