జమ్మికుంట: మడిపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని కోరారు. ప్రజా ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుందని తెలిపారు. నేరెళ్ల రాజమల్లు, ఎగ్గెటి సదానందం పాల్గొన్నారు.
జమ్మికుంట: వ్యవసాయ మార్కెట్ కమిటీలో 24-10-2025, శుక్రవారం నాడు పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి.విడి పత్తి 1200 క్వింటాళ్ల రాగా, ధరలు క్వింటాలుకు ₹7,200 నుండి ₹6,100 వరకు పలికాయి. కాటన్ బ్యాగ్స్ 27 క్వింటాళ్లకు ₹6,600 నుండి ₹5,500 వరకు ధర లభించింది.మార్కెట్‌కు 25, 26 తేదీలలో (శని, ఆదివారం) సెలవు ప్రకటించారు. మార్కెట్ తిరిగి 27-10-2025, సోమవారం నాడు ప్రారంభమవుతుంది.
జమ్మికుంట: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మికుంట వ్యవసాయ కాటన్ మార్కెట్ యార్డ్ (ఏఎంసీ)లో కరీంనగర్ జిల్లా సహకార మార్కెట్ సొసైటీ (డీసీఎంఎస్) ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.జమ్మికుంట ఏఎంసీ చైర్ పర్సన్ పుల్లూరు స్వప్న సదానందం, వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, గ్రేడ్ వన్ సెక్రటరీ ఆర్. మల్లేశం, గ్రేడ్ టు రాజ మరియు సిబ్బంది, సెంటర్ ఇంచార్జీ ఎగిత అశోక్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ పుల్లూరు […]
తేదీ: అక్టోబర్ 14, 2025జమ్మికుంట: రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పత్తి క్రయవిక్రయాలపై చర్చించేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ), జమ్మికుంట ఛైర్‌పర్సన్ శ్రీమతి పుల్లూరి స్వప్న – సదానందం గారు మరియు పాలకవర్గం అధ్యక్షతన ఈ రోజు (అక్టోబర్ 14, 2025) సాయంత్రం 5:00 గంటలకు కాటన్ మార్కెట్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పత్తి వ్యాపారస్థులు, ట్రేడర్లు, మరియు అర్తి దారులు పాల్గొన్నారు.ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ, రైతులకు న్యాయం జరగాలని, మంచి గిట్టుబాటు ధరలు […]
జమ్మికుంట, అక్టోబర్ 13, 2025:జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం (13-10-2025) పత్తి ధరల వివరాలు ఇలా ఉన్నాయి: * విడి పత్తి (కాటన్): ఈ రోజు మార్కెట్‌కు 1,408 క్వింటాళ్ల విడి పత్తిని 174 వాహనాల్లో రైతులు తీసుకువచ్చారు. ధరలు కనిష్టంగా రూ. 5,500 నుండి గరిష్టంగా రూ. 6,400 వరకు పలికాయి. * కాటన్ బ్యాగులు: 43 క్వింటాళ్ల పత్తిని 28 మంది రైతులు మార్కెట్‌కు తీసుకురాగా, ధరలు కనిష్టంగా రూ. 5,500 నుండి […]