ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన మచ్చర్ల మొగిలి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ వెంటనే స్పందించారు. అధికారులతో మాట్లాడి రూ.1,75,000 విలువైన ఎల్ఓసీని మంజూరు చేయించారు. కష్ట సమయంలో అండగా నిలిచిన ప్రణవ్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఓటు చోరీ అంశంపై ఏఐసీసీ పిలుపు మేరకు ఇండియా కూటమి ఆధ్వర్యంలో కరీంనగర్లో భారీ నిరసన నిర్వహించారు. ఇందిరా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టిన నాయకులు, అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ మాట్లాడుతూ ప్రజల మద్దతు లేకనే బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.
జమ్మికుంట పట్టణంలో దిడ్డి సుధాకర్ సతీమణి శ్రీదేవి ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ హాజరై శ్రీదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో దిడ్డి రాము, పొరండ్ల శ్రావణ్, గడ్డం దీక్షిత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట ఆబాది 14వ వార్డులో ప్రజల సౌకర్యార్థం హైమాస్ట్ లైట్ ఏర్పాటుకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మైస శిరీష రవి, మాజీ కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్, జక్కే రవీందర్, పొడేటి అనిల్, పంజాల అనిల్, తదితరులు పాల్గొన్నారు.