Day: September 29, 2026

Sep 29
బచ్చు భాస్కర్‌కు ఘన సన్మానం

జమ్మికుంట: కరీంనగర్ ఉమ్మడి జిల్లా కాటన్ జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన జమ్మికుంటకు చెందిన బచ్చు భాస్కర్‌ను శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు డింగరి హరికృష్ణ ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరికృష్ణ ఆచార్యులు, విశ్రాంత ఏఈ కేదారేశ్వర్, పి.సమ్మారావు, వెంకటేశ్వర్లు, సుంకర యాదయ్య, సమ్మయ్య తదితరులు భాస్కర్‌ను సత్కరించారు.

Sep 29
అన్నదాతకు ఘన సత్కారం

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తున్న సురక్ష మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. రమేష్ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ కే. తిరుపతిని శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు పోషకాహారం అందించడం వారి ఆరోగ్యం, విద్యాభ్యాసానికి ఎంతో దోహదపడుతుందని ప్రిన్సిపల్, డాక్టర్ తిరుపతి పేర్కొన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Listings News Offers Jobs Videos