Day: September 25, 2026

Sep 25
కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడికి సన్మానం

కరీంనగర్ జిల్లా కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన బచ్చు భాస్కర్‌ను జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భాస్కర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు చింతల శ్రీనివాస్, చందా రాజు, దిడ్డి రాము తదితరులు పాల్గొన్నారు.

Sep 25
జమ్మికుంటలో రెయిన్బో ఎలక్ట్రానిక్స్ ప్రారంభం

జమ్మికుంట పట్టణంలో శేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెయిన్బో ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌ను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన సాంకేతికతతో ఎలక్ట్రానిక్స్ షోరూమ్ అందుబాటులోకి రావడం పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలకు సంతోషకరమన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు శ్రీలం శ్రీనివాస్, చందా రాజు, చింతల శ్రీనివాస్, దిడ్డి రాము, సీఐ రామకృష్ణ, సతీష్ రెడ్డి, గడ్డం దీక్షిత్, పోనగంటి మల్లయ్య, రాజు […]

Sep 25
జమ్మికుంట మార్కెట్‌లో కొత్త పత్తి ధర రూ.7,551

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25, శుక్రవారం కొత్త పత్తి మార్కెట్‌కు 8 క్వింటాళ్ల అరైవల్స్ వచ్చాయి. ఒక వాహనం ద్వారా వచ్చిన పత్తికి క్వింటాల్‌కు రూ.7,551 ధర నమోదైంది. పత్తి బ్యాగుల అరైవల్స్‌ నిల్‌గా ఉన్నాయి. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో మార్కెట్‌కు సెలవు. సెప్టెంబర్ 28, సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుంది.

Listings News Offers Jobs Videos