Day: September 24, 2026

Sep 24
TTD అక్టోబర్ హోమం టికెట్లు రేపు విడుదల

24 సెప్టెంబర్, 2026: అక్టోబర్‌ 2026 నెలకు సంబంధించిన హోమం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సెప్టెంబర్‌ 25న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. పరిమిత సంఖ్యలో టికెట్లు అందుబాటులో ఉండనున్నందున భక్తులు నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Sep 24
TG-SET హాల్ టికెట్స్ విడుదల

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-SET)–2026కు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్‌లో పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రం తదితర వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు తమ వివరాలతో లాగిన్ అయి హాల్‌టికెట్‌ పొందవచ్చు. Hall Tickets డౌన్లోడ్ చేసుకోవడానికి కింది వెబ్సైట్ సంప్రదించండి https://tgset.aptonline.in

Listings News Offers Jobs Videos