జమ్మికుంట: పట్టణంలో బుధవారం జరగనున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ నాయిని చెరువు వద్ద పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం పలు ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్, పోలీసు అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, కౌన్సిలర్ చందా రాజు, ఏఈ వికాస్, […]
హైదరాబాద్: తెలంగాణలో హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బంజారాహిల్స్‌లో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులతో సమావేశమయ్యారు. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల సంక్షేమ బోర్డుల విధి విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం గుంటి సామ్రాజ్యం, అన్నేడి వెంకట్ రెడ్డి, ఎస్.వి. శివకుమార్, కన్నెగంటి రవి, ఎస్.కే. సల్లావుద్దీన్లతో కమిటీ ఏర్పాటు చేశారు. హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, […]
జమ్మికుంటలోని పాత ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు సందర్శించారు. భవనం చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ కళాశాలను ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు. విద్యార్థులకు సరైన హాస్టల్ వసతి లేక ఇబ్బందులు ఎదురవుతున్నందున, భవనాన్ని వెంటనే హాస్టల్‌గా వినియోగించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో SFD కో-కన్వీనర్ గోస్కుల అజయ్, జమ్మికుంట నగర కార్యదర్శి భోగం శశాంక్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కొత్త పత్తి కొనుగోళ్లకు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న-సదానందం మంగళవారం ముహూర్తం చేశారు. రైతులను శాలువాలతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. బహిరంగ వేలంలో పత్తికి గరిష్ఠంగా క్వింటాల్‌కు రూ.7,272, కనిష్ఠంగా రూ.7,011 ధర పలికింది. మురళీకృష్ణ, మల్లికార్జున ట్రేడర్స్ పత్తిని కొనుగోలు చేశారు. రైతులు నేరుగా మార్కెట్ యార్డుకు పత్తిని తీసుకువచ్చి మంచి ధరలు పొందాలని చైర్పర్సన్ సూచించారు.