Day: September 21, 2026

Sep 21
మండల సమీక్షా సమావేశం

జమ్మికుంట, 21 సెప్టెంబర్, 2026: మండల పరిషత్ సమావేశ మందిరంలో స్పెషల్ ఆఫీసర్ లింగారెడ్డి అధ్యక్షతన మండల సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో 17 మంది సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓ పద్మావతి, ఎంఆర్ఓ సుధాకర్ పాల్గొన్నారు. ఆయా శాఖల పనులపై సమీక్ష నిర్వహించగా, సర్పంచులు మందుల కొరత, వైద్య సిబ్బంది కొరత, ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులు తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని లింగారెడ్డి […]

Sep 21
మదన్ రావు మృతి పట్ల మోలుగూరి సదయ్య సంతాపం

ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మాజీ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వర్కుటి మదన్ రావు అనారోగ్యంతో సెప్టెంబర్ 20న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతి చెందారు. ఆర్మీ, రైల్వే శాఖల్లో సేవలందించిన ఆయన అనంతరం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. మదన్ రావు మృతికి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మోలుగూరి సదయ్య సంతాపం తెలిపారు. మదన్ రావు భౌతికదేహంపై కాంగ్రెస్ కండువా వేసి నివాళులర్పించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Listings News Offers Jobs Videos