Tag: Degree College

Sep 22
పాత ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి

జమ్మికుంటలోని పాత ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు సందర్శించారు. భవనం చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ కళాశాలను ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు. విద్యార్థులకు సరైన హాస్టల్ వసతి లేక ఇబ్బందులు ఎదురవుతున్నందున, భవనాన్ని వెంటనే హాస్టల్‌గా వినియోగించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో SFD కో-కన్వీనర్ గోస్కుల అజయ్, జమ్మికుంట నగర కార్యదర్శి భోగం శశాంక్ తదితరులు పాల్గొన్నారు.

Listings News Offers Jobs Videos